ఓజోన్ ను రక్షించాలి - పసుమర్తి నాగేశ్వరరావు

ఓజోన్ ను రక్షించాలి - పసుమర్తి నాగేశ్వరరావు

ఓజోన్ ను రక్షించాలి

ఓజోన్ జీవరాశి రక్షణ
ఓజోన్ జీవరాశి సంరక్షణ
ఓజోన్ కి ఇవ్వాలి నేడు మనం రక్షణ
లేకుంటే జీవరాశికి తప్పదు భక్షణ

ఓజోన్ ప్రాణకోటిని కాపాడెను
ఓజోన్ ప్రాణకోటి ముప్పును తప్పించును
ఓజోన్ పై పరిశోధనలు జరిగెను
ఓజోన్ ను రక్షించుకునే ఆవశ్యకత ఏర్పడెను

ఓజోన్ ఆపును అతినీలలోహిత కిరణాలు
అందుకే ఓజోన్ అందించును మనకు రక్షణ కవచాలు
కాలుష్యం వలన దెబ్బతింటున్నది ఓజోన్
అందుకే మనం రక్షించాలి ఓజోన్

వహించకు నిర్లక్ష్యం
చేయకు అలక్ష్యం
గుర్తుంచుకో నీ లక్ష్యం
అదే ఓజోన్ పరిరక్షణ

కల్పించాలి ప్రజలకు అవగాహన
చేయాలి కాలుష్యం నిర్మూలన
చెట్లు విరివిగా పెంచేటట్లు చేయాలు సాధన
మొక్కలు పెంచడం పై చూపాలి శ్రద్ధా భావన

U.n.o ప్రకటించింది ఓజోన్ దినోత్సవం
సెప్టెంబర్ 16 వ తేదీ యే దాని ఉత్సవం
ఓజోన్ రక్షణ దినోత్సవం
జీవరాసి కి ఒక మహోత్సవం

ఫ్యాక్టరీలు పరిశ్రమలు నడుం బిగించాలి
రసాయనాలు క్రిమిసంహారక కాలుష్యం ఆపాలి
అట్లాంటిక్ లో ఓజోన్ పొర రంధ్రం పెరగకుండా నివారించాలి
30దేశాలు తీసుకున్న తీర్మానం సవ్యం గా అమలు జరపాలి

అందుకే వృక్షో రక్షతి రక్షిత
చెట్లు ప్రగతికి మెట్లు
ఓజోన్ రక్షా జీవావలి రక్షా
నినాదాలతో ఓజోన్ ను రక్షించాలి

ఐక్యతతో ముందడుగు వేయాలి
సమైక్యత తో సాధన చేయాలి
సఖ్యత తో సాధించాలి
సర్వమానవాలి ని రక్షించాలి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూరు టీచర్
         విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments