దేవుడు చెక్కిన శిల్పాలు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూర్)

దేవుడు చెక్కిన శిల్పాలు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూర్)

దేవుడు చెక్కిన శిల్పాలు

మనుషులందరు దేవుడు చెక్కిన శిల్ప రూపాలే
జననం తరువాత మనిషి తనని తాను చెక్కుకొనే శిల్పరూపం
మనిషి తనను తాను చెక్కుకోవడం అంటే వ్యక్తిత్వం చెక్కుకోవాలి
నిస్వార్ధమైన మానవత్వాన్ని చెక్కుకోవాలి

మహాపురుషుల మహోన్నతను తెలుసుకొని
ఉత్తముల ఉన్నతత్వాన్ని తెలుసుకొని
మానవ నైతికవిలువలు అవగాహన చేసుకొని
మార్గదర్శమైన మానవ రూపాన్ని తనకు తానే చెక్కుకోవాలి

కుంచితము కానీ సంకుచిత భావాలతో
లక్ష్య సాధన కలిగిన సలక్షణమైన లక్ష్యాలతో
అంకితభావం కలిగిన అకుంఠిత దీక్షతో
కర్తవ్యం కార్యరూపమై కథం తొక్కేలా మనల్ని మనం చెక్కుకోవాలి

మనం దేవుడు చెక్కిన శిల్పాలం అని తెలుసుకోవాలి
మనల్ని మనం ఇంకా మలచుకోవాలి
ఆదర్శభావాలు అలవర్చుకోవాలి
మంచి శిల్పం మనం కావాలి

ఆత్మసౌందర్యమే మనిషి నిజమైన రూపం
బాహ్యసౌందర్యం కన్నా ఆత్మసౌందర్యమే మిన్న గల రూపం
.మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి తనను తాను నిరూపించుకోవాలి
అప్పుడే దేవుడు చెక్కిన శిల్పమైన మనం అపురూపశిల్పాలవుతాం


రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూరు
         విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామీఇస్తున్నాను

0/Post a Comment/Comments