జీవన వికాస మార్గనిర్థేశకులు --దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

జీవన వికాస మార్గనిర్థేశకులు --దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.


జీవన వికాస మార్గనిర్ధేశకులు


జీవితాన్ని మలుపు తిప్పే వారు ఆదర్శ  గురువులు
విజ్జానముతో వెలుగులు విరజిమ్మే కాంతి  గురువులు

క్రమ శిక్షణతో దారి చూపి నడిపించే మార్గదర్శ  గురువులు
పుస్తక ప్రపంచాన్ని పరిచయం చేసే భోధక  గురువులు

మన ఎదుగుదలను తమ సంతృప్తిగా భావించే ఆశయ  గురువులు
అక్షరాల లక్షణాలతో ప్రగతి గెలుపును అందించే దిశ  గురువులు

అజ్ఞానం తొలగించి తీరం చేర్చే నావ లాంటి చుక్కాని  గురువులు
ఆదర్శం నింపి లక్ష్యం వెైపు అడుగులు వేయించే భవిష్యత్  గురువులు

అంతరంగం లోని చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతి గురువులు
సమాజానికి ఉత్తమ పౌరులను అందించే చైతన్య  గురువులు

భాధ్యత లేని వాళ్ళకి విధులను నిర్దేశం చేసే ధర్మ గురువులు
అవతార పురుషులకు కూడా అసమాన్య ధర్మాన్ని భోధించే  తప:గురువులు

చేతులెత్తి నమస్కరించే పవిత్ర వ్యక్తిత్వం నిండిన మానవతా  గురువులు
అక్షరాలను నేర్పి, ఆదర్శాలను నింపి మనుషులుగా మలిచే శ్రామిక గురువులు

నవ సమాజ నిర్మాణ ఆశయ సాధకులు అయిన ఉత్తమ  గురువులు
విద్యార్థి మనసులోని అహంకార చిత్తం అనే మలినాలను తొలగించే పరిపూర్ణ గురువులు

అజ్ఞానాంధకారం ను పారద్రోలి దైవత్వాన్ని చూపే పురోహిత  గురువులు
శిష్యులను సానబెట్టి సద్గుణాలు తో  తీర్చిదిద్దే నిజమైన  గురువులు

ముక్తి మార్గము భోధించే గుణాతీతులు, భగవత్స్వరూపులు అయిన అమ్మ తరువాత లోకాన్ని చూపే అసమాన్య జ్ఞాన సంపద నిచ్చే గురువులను స్మరించటం మన అదృష్టం మన కర్తవ్యం

--దొడ్డపనేని శ్రీ విద్య,
విజయవాడ,
05/092021.0/Post a Comment/Comments