వేదన
బీడుభూమి నింగిన ఉన్న మేఘాన్ని అడిగింది వర్షించమని
నా గొంతు తడి ఆర్చమని
పూలమొక్క ప్రాధేయపడింది నను తెంచవద్దని తెంచినా దైవ సన్నిధికి చేర్చమని
సెలయేరు అడిగింది నను కలుషితం చేయొద్దని నలుగురికి సేద తీరుస్తానని
చల్లగాలి అడిగింది నను రసాయనాలతో విషపూరితం చేయొద్దని
పచ్చని చెట్లు ప్రాధేయపడుతున్నాయి మము నరకవద్దని మావల్ల అనేక లాభాలు ఉన్నాయని
ప్రకృతి ప్రాధేయపడుతుంది నను నాశనం చేయవద్దని నా వల్ల జీవకోటికి సత్ఫలితాలున్నాయని
భూమాత కోరుతుంది నా పై పెనుభారం మోపవద్దని మోయలేకపోతున్నానని
ఎవరు ఎన్ని చెప్పిన ఎంత చెప్పినామానవుడు
దానవుడుకానీదానవుడు
మాధవుడు చెప్పిన విననిమానవుడు
వానరుడు కానీ వానరుడు
స్వార్ధానికి పరాకాష్ట ఈర్ష్యాద్వేషాలకు ప్రతీక
అహం విడవని అహంభావం
ఇహం ఎరుగని గర్విష్టి
చెపుతోంది కాలం సమాధానం
పతనమే వారికి గుణపాఠం
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా