మూర్తీభవించిన తెలుగుదనం -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

మూర్తీభవించిన తెలుగుదనం -డాక్టర్ అడిగొప్పుల సదయ్య


సీ.స.
ఎవ్వాని కవితలో ఏడు కొండల వాని
కోడలే నర్తించు కోర్కె తీర

ఎవ్వాని కవితలో ఏరులై పదములే
ఒలకించు గమకాలు హొయలు మీర

ఎవ్వాని కవితలో ఏర్పడు తెలుగంత
మూర్తీభవించిన కీర్తి వోలె

ఎవ్వాని కవితలో ఎల్ల తెలుగునాడు
చిత్రమై మాట్లాడు మిత్రునోలె

ఆ.వె.
అతడి కవిత గురియు నమృతంపు వర్షము
నతడి కవిత మెరయు నరణి వలెను
అతడి కవిత యరయు చితికిన బతుకుల
శ్రీయుతుడతడు మన శ్రీ సినారె...


0/Post a Comment/Comments