"ఆంధ్రకవితాగురుడు - నన్నయ్య" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"ఆంధ్రకవితాగురుడు - నన్నయ్య" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

ఆంధ్రకవితాగురుడు - నన్నయ్య


వేదవ్యాసమహర్షి విరచిత
సంస్కృత మహాభారతాన్ని
తెనుగున అనువదించమన్న
రాజరాజనరేంద్రుని ప్రేరణతో
నన్నయభట్టారకుడు స్వతంత్ర కావ్యంగా
ఆంధ్రమహాభారతాన్ని రచించడానికి
పూనుకొని తెలుగున ఆదికవి అయ్యాడు

శ్రీవాణిగిరిజాశ్చిరాయ అనే
పద్యంతో ప్రారంభించి
తెలుగు ప్రజలకు సంపద, విద్య, శక్తికి
సంకేతమైన లక్ష్మి, సరస్వతి, పార్వతుల
అండదండలు వుండాలని ఆశించిన
మహానుభావుడు నన్నయ

మహాభారత కథ ప్రసన్నంగా
అక్షర రమ్యతతో కూడి
నానా రుచిరార్థ సూక్తి నిధిలా
వైదిక సంస్కృతికి మూల స్తంభంగా
నిలవాలని, స్వతంత్ర కావ్యంగా
తీర్చిదిద్దాలని ప్రయత్నించిన వాగనుశాసనుడు

గతకాలము మేలు
వచ్చు కాలము కంటెన్ అని
ముందు చూపును తెలిపి
తెలుగు సాహిత్యానికి మార్గదర్శకుడయ్యాడు


పేరు: ఆచార్య ఎం రామనాథం నాయుడు
ఊరు: మైసూరు
ఫోన్ నం: 8762357996

0/Post a Comment/Comments