పదునెక్కిన అక్షరం.. కాళోజీ కవనం ---మోటూరి నారాయణ రావు

పదునెక్కిన అక్షరం.. కాళోజీ కవనం ---మోటూరి నారాయణ రావు

పదునెక్కిన అక్షరం.. కాళోజీ కవనం 
                   ---మోటూరి నారాయణ రావు

తెలంగాణ భాషకు, యాసకు
అచ్చమైన అక్షరాల పొందిక 
బడుగుజీవుల గుండె చప్పుడు 
పలుకుబడుల భాషకు పట్టం కట్టిన ప్రజాకవీంద్రుడు కాళోజీ 

నిఖార్సయిన మట్టి వాసనల
వేడి భావజాల మెత్తటి సూరీడు
అన్యాయంపై ఎగ్గుపెట్టిన అస్ర్తం
అన్యభాషపై కొండంతవిముఖం 

ఒక్కసిరా చుక్కతో ..
లక్ష మెదళ్లను కదిలించే 
అక్షర శిల్పం కాళోజి..
అనతి పదాలతో 
నిప్పుకణికలను జ్వలించు
మండే అగ్నిగోళం  కాళోజి ..

ఉరికే ఉప్పెన... ఆ కలం 
ఎగసే కెరటం..ఆ పదం 
కురిసే వర్షం..  ఆ కవనం 
మెరిసే.మెరుపు..
ఆ భావజాలం
పదునెక్కిన అక్షరం... 
కాళోజీ కవిత్వం...

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి  జయంతిని పురస్కరించుకుని ఆయనకు  నా అక్షర నివాళి 

రచన: మోటూరి నారాయణ రావు,
హైదరాబాద్, జర్నలిస్టు, 
చరవాణి: 9346250304.

0/Post a Comment/Comments