పదిలం --విస్సాప్రగడ పద్మావతి

పదిలం --విస్సాప్రగడ పద్మావతి


అంశం: చిత్ర కవిత
శీర్షిక _    పదిలం

మస్తకాన  పుస్తకం పదిలం
పుస్తకం చేత పడితే బతుకుఅందలం

మెదడులో నిక్షిప్తమైన నిస్తేజం
పుస్తక పఠనంతో కలుగును ఉత్తేజం

పొత్తమును చేత పట్టు
 వెలుగును సాధించు

మనసుపెట్టి చదివిన చదువు 
నీ జీవన గతికి అదియే జీవనజ్యోతి

గమ్యం నిర్దేశించి 
మంచి చెడుల తారతమ్యం 
తెలిపేది పుస్తకమే
 
విచక్షణ జ్ఞానం ప్రసాదించి
విజ్ఞానాన్ని ఆర్జించి 
కీర్తి ని సంపాదించి ఇస్తుంది

మస్తకాన జ్ఞానం 
పంచితే  రెట్టింపగును విజ్ఞానం

సంపాదించిన జ్ఞానసముపార్జన
దొంగలు దొంగిలించేది కాదు
బలవంతంగా లాగేది కాదు

మంచి పుస్తకం
నడతను నడకను నేర్పిస్తుంది
అనడం అతిశయోక్తి కాదు కదా

హామీ పత్రం 
ఈ రచన నా స్వీయ రచన.
అనుకరణ కాదు

పేరు 
విస్సాప్రగడ పద్మావతి 
హైదరాబాద్

0/Post a Comment/Comments