గురువు ---పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

గురువు ---పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

గురువు
---పసుమర్తి నాగేశ్వరరావు, 
టీచర్, సాలూరు.

బాలబాలికలు గులాబీ మాలికలు
భావితరానికి విజ్ఞాన నిధి పీఠికలు
బంగారు భవితవ్యానికి అభివృద్ధి దీపికలు
విశ్వఖ్యాతి విశ్వశాంతి కి నిర్దేశిక జ్ఞాపికలు

ఉపాధ్యాయ వనములో గురువు నాటిన పసిడిమొగ్గలు
నైపుణ్యపు ఉపాధ్యాయులు చేతిలో ఎదిగే మొక్కలు
విజ్ఞానపు ఎరువులతో పెరిగే సుగంధ పరిమళ పుష్పాలు
ఉపాధ్యాయులు అనే తోటమాలీలు వికశింపజేసిన కలాపుష్పాలు

సారవంతమైన భూమిలో సహజ ఎరువు విద్యార్థి
తగిన రక్షణతో రక్షణ కవచం ఏర్పరిచి దిగుబడి సాధించే రైతే ఉపాధ్యాయుడు
తను కరుగుతూ ఇంకొక జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే ఉపాధ్యాయుడు
నిస్వార్ధం గా విద్యను అందించి
విద్యార్థి విజయాన్ని గురుదక్షిణ గా భావించిన వాడే గురువు

మానవుని వికృత చేష్టలతో ప్రకృతి పగ సాధించవచ్చు
కన్నబిడ్డలు తల్లిదండ్రులను మోసం చేయవచ్చు
గతి తప్పి సూర్యచంద్రుల గమనం మారవచ్చు
కానీ నిత్యం విద్యార్థి విజయాన్ని లాభాపేక్ష లేకుండా 
ఆనందం తో ఆస్వాదిస్తూ తన జీవితాన్ని అంకితం చేసేవాడే గురువు

సూది దారం బంధం గురుశిష్యబంధం
కాలే ఇనుము సమ్మెట బంధం గురుశిష్యబంధం
మూసలో కరిగించిన బంగారం లాంటి సంబంధం
జగతి ఉన్నంతవరకు విద్యార్థి శ్రేయస్సే గురువు లక్ష్యం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
            విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments