అక్షరం రక్షణం --సయ్యద్ జహీర్ అహ్మద్,కర్నూల్,

అక్షరం రక్షణం --సయ్యద్ జహీర్ అహ్మద్,కర్నూల్,


అక్షరం రక్షణం

క్షరం కాదెపుడు అక్షరం
భాషా సౌందర్యానికి
అపురూప లావణ్యం
వాక్కు మీద స్వాతంత్రం వున్నట్టు
అక్షరం మీద పెత్తనం వుండదు
అక్షరాల మీద వ్రాసిన ప్రామాణికాలు వాదాలతో సరిపెట్టుకోలేవు!
శక్తివంతమైన అక్షరరూపం యంత్రాంగాన్ని ఆదేశిస్తుంది
అక్షరం ఆయుధమై భావప్రకటనై దేశాన్ని కదిలిస్తుంది
అక్షరం రెండు వైపులా పదును
లిఖితపూర్వకమైనసాక్ష్యం శిలాక్షరాలై
తామ్రపత్రాల శాసనాలై రాజరికానికి
దిశానిర్దేశం చేస్తాయి.

భాష జీవగతికి మార్గదర్శకమవుతుంది
చిన్నచూపుకు వ్యతిరేక ఉద్యమం
అక్షరవిన్యాసం
నాలుగు రాళ్లు వెనకేసుకున్నా గాని
అక్షరం తోడ్పాటు లేకుంటే
అవరోధాలు ఎదురవుతాయి
మరణవాంగ్మూలానికి
అంతిమంగా వీలునామా అవుతుంది!
అక్షర కుక్షులకు విలక్షణమైన స్వభావం భూషణమవుతుంది
అక్షరం నీటి మీది రాత కాదు 
రక్ష కలిగిన చట్టం...శాసనం...
ఉపసంహారం...
వీణావాణి విశ్వదర్శిని పుస్తకం!!
       

-సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.0/Post a Comment/Comments