గణేశ స్తుతి
పార్వతీ తనయునకు పరమేశు పట్టికిని
సుందరాకారునకు శూర్పకర్ణునకును జయమంగళం నిత్య శుభమంగళం
గజముఖా వరదునకు గణనాథ దైవముకు
ఆఖువాహనపతికి లోకనాయకునకును జయమంగళం నిత్య శుభమంగళం
తొలిపూజ దేవునకు నెలరాజ వైరికిని
లంబాకాయునకును లక్ష్మీకారునకును జయమంగళం నిత్య శుభమంగళం
జగమేలు సామికిని నగరాజ మనుమకును
నిగమాంత వేద్యునకు నిత్య శుభకారికిని జయమంగళం నిత్య శుభమంగళం
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125
Post a Comment