మహోన్నత వ్యక్తి
ఉపాధ్యాయ లోకానికి ఉషోదయం
భారతదేశానికి మహోదయం
విద్యార్థిలోకానికి తేజోమయం
తల్లిదండ్రులకు తన్మయం
మన సర్వేపల్లి తిరుత్తని లో జననం
మనతెలుగువారి ఆనంద స్మరణం
వేనోళ్ళ ప్రశంసించు నిరాడంబర వదనం
సాధారణం నుండి అసాధారణం కు ఎదిగిన సద్గుణం
వృత్తికి వన్నెతెచ్చి జాతికి కీర్తి తెచ్చి
ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవులు అధిరోహించి
ఆ పదవులకే మహోన్నతను తెచ్చి పెట్టి
ప్రపంచానికి ఆదర్శమై విశ్వఖ్యాతి నొందె
గురుబ్రహ్మలకే బ్రహ్మ గా
విద్యార్థుల భవితకు అపరబ్రహ్మగా
మన భారతజాతీ కి విద్యాబ్రహ్మ గా
భారతావని బ్రహ్మగా పొందెను కీర్తి
ఎందరికో ఇచ్చెను స్ఫూర్తి
పట్టించుకోలేదు తన కీర్తి
సేవా సదనమే నిత్యమైన ఆర్తి
ఏవత్ జగతి కీర్తించే మనస్ఫూర్తి
సర్వేపల్లి గారు కాదు ఒక సాధారణ వ్యక్తి
మహోన్నతం గా ఎదిగిన మహాశక్తి
అసాధారణ ప్రతిభాగల మేధాశక్తి
మంచిచెడుల విశ్లేషణ గలిగిన మహాయుక్తి
అందుకే ఓ గురుబ్రాహ్మ అందుకోండి మా ఈ పాదాభివందనాలు
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా