నిత్యవిద్యార్థి-గురువు --ఎన్.రాజేష్

నిత్యవిద్యార్థి-గురువు --ఎన్.రాజేష్

*నిత్యవిద్యార్థి-గురువు*
---------------------------

అ ఆ లతో మొదలు
 గుణింతాల వరకు
మాతృభాషనుండి
అన్య భాషల వరకు
శాస్త్రముల నుండి
సకల విద్యల వరకు
చదువుతో పాటు
సంస్కారం వరకు
నేర్పించే నేర్పరి
బోధించే బోధకుడు
అజ్ఞానపు చీకటిని
తొలగించి
విజ్ఞానపు వెలుగును
ప్రసాదించే జ్ఞాన దీప్తి
కుల మత జాతి
అంతరం ఎరుగని విద్యాఘని
దారితప్పుతున్నవారికి
దిశ నిర్దేశం
చేయు మార్గ దర్శి
శిష్యుల ఉన్నతికి కృషి చేసే
ఉన్నత వ్యక్తిత్వ స్వభావి
అక్షర జ్ఞానం
అందించే కల్పతరువు
విద్యాజగతికి పూజ్యులు
అద్భుత జ్ఞాన నిధి
సకలశాస్త్రాలబంగారుఘని
జగతినజ్ఞాని,ప్రగతినవిజ్ఞాని
నిత్యవిద్యార్థి,
సకల శాస్త్రా పారంగతుడు 
సాక్షాత్ పరబ్రాహ్మ స్వరూపం
అదియే గురువు..
అతడే ఉపాధ్యాయుడు.
వందనం..గురువులందరికి!
అభివందనం..గురుపూజ్యులందరికి!!

       *ఎన్.రాజేష్*
(కవి, రచయిత, జర్నలిస్ట్)
        హైదరాబాద్.

0/Post a Comment/Comments