ఎదుగు - ఒదుగు
కవి:- కొల్లూరు వెంకటరమణమూర్తి,
హైదరాబాదు, 📱:- 9966016296
******************************
ఇంకా ఇంకా ఎదుగు !
ఎంత ఎదిగినా నీవు
అంటలేవు ఆకాశాన్ని !
ఎదిగి ఏమి ఉపయోగం ?
ఎవ్వరికీ అందకపోతేను !
ఎందుకూ కొరగాకుంటేను !
ఎందుకొచ్చిన ఆ ఎదుగుడు ?
ఎదుగు ఎదుగుట కంటెను
ఒదుగుట మేలని తెల్సుకో !
ఒదిగితేనే ఒనగూడగలదు
ఎవరికైనా ఏదో ప్రయోజనం !
ఫలాలను పొందగలిగేది
చెట్టు ఒదిగి ఉంటేనే కదా !
నీవల్ల పొందగలరుపకారం
నువ్వందుబాటైతేనే కదా !
ఒదిగినవాడు చిదిగిపోడు
చిదగనోడు చక్కగుంటాడు !
ఒదిగియుండడం నేర్వాలి !
ఒదిగి ఔననిపించుకోవాలి !!
********************************
ఇది నా ఊహాజనిత స్వంత
రచనయే తప్ప దేనికీ నకలుగానీ,
అనుకరణగానీ కాదని హామీ ఇస్తూ
ఇందుమూలంగా తెలియజేస్తున్నాను.
ఇట్లు
కొల్లూరు వెంకటరమణమూర్తి, హైదరాబాదు
Post a Comment