ప్రపంచ శాంతి సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖ రచయిత్రి దేవసాని కల్పన

ప్రపంచ శాంతి సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖ రచయిత్రి దేవసాని కల్పన

సెప్టెంబర్ 18  కొరియాకు చెందిన HWPL (హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రిస్టోరేషన్ ఆఫ్ లైట్) వారు 7 వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రపంచ శాంతి సమ్మేళనాన్ని యధాతధంగా ఈ సంవత్సరం జూమ్ అంతర్జాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హెచ్. డబ్యూ. పి. ఎల్. యూత్ విభాగం ఐ. పి. వై. జీ. ( ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్ ) సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత్రి దేవసాని కల్పన జామ్ అంతర్జాల సమ్మేళనంలో పాల్గొని ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతూ ఉగ్రవాదం, దురాక్రమణలు, అణచివేత చర్యలు, ఆధిపత్య పోరు, స్త్రీలపై జరుగుతున్న హింసా పూరిత చర్యలు పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో వికసించాలని యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం అంతా ఎదురు చూస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మ్యాన్ హీలీ,  వివిధ దేశాల నుండి సంస్థ సభ్యులు తమ తమ ప్రసంగాలు వినిపించారు.
0/Post a Comment/Comments