కవి మిత్రులకు విన్నపం --డా విడి రాజగోపాల్

కవి మిత్రులకు విన్నపం --డా విడి రాజగోపాల్

కవి మిత్రులకు విన్నపం

ఈ మధ్య వాట్స్అప్ ఈ మెయిల్ మాధ్యంలో మన రచనలకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే దీని ఆసరాగా తీసుకొని కొందరు తెలివిపరులు కవితా పోటీలని, అందులో మీకు వచ్చే లైక్స్ ఆధారంగా విజేతలని మనల్ని వారి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వాడుతున్నారు. ఈ మధ్యనే "అంతర్జాతీయ శాంతి దినోత్సవం" సందర్భంగా కవితా పోటీలన్నారు. వీడియో కవితలనాహ్వానించారు. అంతవరకు బాగుంది. కవితలు ఏవిబాగున్నాయో నిర్ణయం చేయవలసింది అందులో ప్రవేశమున్న నిష్ణాతులు గానీ, మనం మనకు తెలిసిన సమూహంచే లైక్స్ కొట్టించుకొని విజేతలనిపించుకోవడం, కవివర్యులకు మంచిపనంటారా? ఇందులో వారు కంప్యూటర్ డిజైన్ చేసిన  ఒక సర్టిఫికెట్ ఇస్తారు.
ఇందులో ఉన్న మతలబ్ ఏమిటంటే, దాదాపు 120 మంది పాల్గొని, మనకు పరిచయం ఉన్న వారి వెంట పడి మన కవితకు లైక్ లు కొట్టించుకొని, వారిచ్చే ఓ పేపరు సర్టిఫికెట్ మన గొప్పదనం అని మురిసిపోవడమా? మన కవిత ఓ చిన్న కవిపండితులు బాగుంది అంటే చాలు . దీని వేనుక ఆ యూట్యూబ్ చానల్ వారికి కనీసం ఓ 3000 లైకింగ్స్ దానివల్ల వారికి వచ్చే ఆదాయం ఎవరికి తెలియదు. దయచేసి ఇటువంటి దగాకోరుల వలలో కవివర్యులు పడవద్దు. నేను ఇవన్నీ గమనించక కవిత పంపాను. నేను అనుకుంటే ఒక్క రోజులో ఓ వెయ్యి లైక్స్ తెచ్చుకోగలను. అయితే కనీసం ఒక్క లైకింగ్ కూడ పంపలేదు. ఈ పద్ధతి మంచిది కాదని వారికి చెప్పాను.

డా విడి రాజగోపాల్
950690690,9966900045.

 

1/Post a Comment/Comments

Post a Comment