బహుదూరపు బాటసారులం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

బహుదూరపు బాటసారులం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

బహుదూరపు బాటసారులం...

ఎపుడో చెప్పెను ‌వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుతా వినుకో మిత్రమా!
బహు ఖరీదైనది కాలమని
కలకానిది తిరిగిరానిది జీవితమని
కోహినూర్ వజ్రం కన్న విలువైనది శీలమని
రాక మానవు సూర్యోదయం వృద్దాప్యమని

నిజమే నాడు భుజాలపై ఆడుకున్న పిల్లలు
నేడు ఎప్పుడు ఎదిగారో మాకు తెలియదాయె

నాటి మా సొంతఇంటి కలలు సాకారమై
నేడు అద్దె ఇంటికష్టాలన్నీ ఆవిరైపోయె

నాడు సైకిల్ తో ప్రారంభమైన మా సంసారం
నేడు హైవేలో కారులో షికారు దాకా వచ్చె

నాడు పిల్లల ఎదుగుదలే మా బాధ్యతనుకున్నాం
నేడు పిల్లలకు దూరమయ్యాం పెనుభారమయ్యాం

నాడు ఉద్యోగమే ఊపిరై మరయంత్రంగా మారి 
నిద్రాహారాలుమాని పిల్లలకోసం రెండుచేతుల ఆర్జిస్తే
నేడు పదవీవిరమణ వచ్చి ఆదాయానికి గండి పడె

నాడు నల్లని జుట్టు‌లా కాపురం గుట్టుగా ఉంటే
నేడు బట్టతలలా మా బ్రతుకంతా బట్టబయలాయె

నాడు కుటుంబమంతా కలిస్తే కులాసంగా ఉండే
అందరం గెలుపుగుర్రాల మీద స్వారీ చేసేవాళ్ళం కానీ
నేడు ఓడిపోయి ఎడారిలో ఒంటరి ఓడలమయ్యాము

ఎప్పుడైతే పిల్లలకు మేము ‌ఎటియంలుగా మారామొ
అప్పుడే మా ప్రయాణం వృద్ధాశ్రమాలవైపు మొదలైంది
వాత్సల్యం కోసం దయ దాక్షిణ్యాలకోసం వెతుకుతున్నాం
ప్రేమపూర్వక పలకరింపులకోసం ఆశతో ఎదురుచూస్తున్నాం

మేమే వృద్దులం... మీ తల్లీదండ్రులం...
ఏకాంతంగా చీకటిలో వెలుగుకోసం వెతుకుతున్న
కలలతీరం చేరాలని...ఆశ పడుతున్న ...
ఆరాటపడుతున్న...బహుదూరపు బాటసారులం..... 

రచన: పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502


0/Post a Comment/Comments