ప్రేమంటే ---శ్రీమతి సత్య మొం డ్రేటి

ప్రేమంటే ---శ్రీమతి సత్య మొం డ్రేటి


మూగ ప్రేమ

ప్రేమంటే మాటలకందని
మధుర భావన
బాల్యంలో తల్లిదండ్రులను విడచి ఉండలేని ప్రేమ...
కల్మషం లేని ప్రేమ...
యుక్తవయస్సు లో ఉరకలు వేసే పరువంలో ప్రపంచమే 
ప్రేమ నిలయం 
ప్రేమ పేరుతో కొందరు కాముకులు వంచనకు గురి అయ్యే ప్రేమ.....
కనిపెంచిన తల్లిదండ్రులను ద్వేషించే ప్రేమ.....
ప్రేమించానని  వెంటపడి 
తిరస్కరిస్తే యాసిడ్ పోయటం
కాదు ప్రేమంటే....
ప్రేమంటే అనురాగం,ఆప్యాయత, భరోసా,కడదాకకలిసిఉండే
భావన...
కన్న వాళ్ళసంతోషపు దీవెన....

ప్రేమంటే ప్రకృతి...
పుట్టిన నాటి నుండీ మరణం వరకు మనల్ని విడిచి పోని బంధం......
అలసట తో ఆకాశం వైపు చూడు
తన మేఘాల హోయలుతో
నక్షత్రాల మెరుపుతో నిన్ను
మైమరిపిస్తోంది.....తన మూగ
ప్రేమతో నిన్నులాలిస్తుంది....
పరుగులు తీసే సెలయేరు నీ చూడు..అలౌకిక ఆనందం ఇస్తుంది
ఎత్తైనపర్వత శిఖరాల్ని చూడు
తన ప్రేమకు సాటిలేరంటుంది.
ఆహ్లాదకర సాయంసంధ్య లో
సాగర సమీప పవనుడి పవనాన్ని ఆస్వాదించు.....
గగనతలం లో సూర్యచంద్రులు
ప్రేమ ముందు ఏ ప్రేమ నిలవదు
సృష్ఠి లో పంచభూతాల ప్రకృతిని ప్రేమించి రక్షించి పూజించు...అదే ప్రేమంటే....
వ్యక్తీకరించలేని మూగప్రేమ ప్రక్తృతి ది....

పేరు :శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు:హైదరాబాద్
చరవాణి:9490239581
ప్రక్రియ:వచనం

0/Post a Comment/Comments