అభినయాల మేటి అక్కినేని --డా. విడి రాజగోపాల్

అభినయాల మేటి అక్కినేని --డా. విడి రాజగోపాల్

అభినయాల మేటి అక్కినేని
( జయంతి సందర్భంగా నివాళి)

అక్కినేని అన్న పేరు
సినీ వినీలాకాశంలో
కొన్ని దశాబ్దాలు  వెలిగింది ఓ వెలుగు
లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోశారు

ఓ జానపదం   ఓ చారిత్రాత్మకం  
ఓ పౌరాణికం  ఓ సాంఘీకం
అన్నిటా రాణించారు
అందర్నీ  మెప్పించారు

ఓ రాజైన ఓ పేదైన
ఓ అమాయకుడైనా ఓ గడుసరియైనా
ఓ డాక్టర్ అయినా
ఓ లాయర్ అయినా
ఓ దొంగరాముడైనా
ఓ దొరబాబైనా
ఓ దేవదాసైనా ఓ బాటసారైనా
ఓ తుకారామైనా  ఓ కబీర్ దాసైనా
ఏపాత్రైనా అందులో ఇమిడిపోయాడు
డూయట్లకు పెట్టింది పేరు
స్టెప్పులేయుటలో చెప్పనలవి కాదు
చివరిదశలో ఓ వాల్మీకి గా రాణించారు

చదువు చూస్తే తక్కువ
నేర్చింది చూస్తే ఎక్కువ
గళం అనర్గళం
వేదాంతం వల్లించగల వేదాంతి

నిండు తెలుగు తనం
నిఖార్సైన  మనస్తత్వం
ఎప్పుడూ తెల్లటి చేనేతలే
సూటు బూటు డాబుదస్తం
అది సినిమాకే పరిమితం
పంచకట్టులోని తెలుగోడు
తెలుగు తనం నిండినోడు

ఆంధ్రరాష్ట్రం అవతరించింది
ఇక పొరుగు రాష్ట్రం వద్దన్నాడు
చెన్నపట్నం వదిలాడు
భాగ్యనగరం చేరాడు
సినిమా పరిశ్రమ భాగ్యనగరికి చేర్చాడు

పకృతి ప్రళయతాండవం చేయగా
జోలె పట్టి  తిరిగాడు
ప్రజాసేవలో ఒకడయ్యాడు


రాజకీయపు  ఉచ్చులో దిగని నేర్పరి
నటనే ఊపిరి అన్న స్పురద్రూపి
ఎత్తు పల్లాలు ఎన్నో చూశాడు
ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు  ఎదిగాడు

అవార్డులు లెక్కలేనన్ని పొందాడు
ఇక చాలు చాలన్నాడు
ఎందరినో  సన్మానించాడు
సహస్ర చంద్ర దర్శనం అబ్బింది
ఇక చాలు చాలన్నాడు
తనువు చాలించాడు

మన మదిఫలకంలో
అలానిలచిపోయిన
మన అభినయాల మేటి
మన అందరి అభిమానాల  ఘనాపాటి
వారి పుట్టినరోజు వారోత్సవం వచ్చింది
ఓ మారు పలుకుదాం జోహార్లు

డా విడి రాజగోపాల్
9505690690


0/Post a Comment/Comments