జగదభి రాముడు - శ్రీ రాముడు
సూర్యవంశమనే పాలసంద్రానికి
పున్నమి చంద్రుడు కౌసల్యా దేవి
గర్భమనే ముత్యపు చిప్పలో జనించిన
మేలి ముత్యం పుత్రకామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్ప వృక్షం
దానవులనే దారుణ అరణ్యాన్ని
దహించే కార్చిచ్చు లోకోపకారం కోసం ఉదయించిన నీలమేఘశ్యాముడు
శాస్త్ర ధర్మాన్ని పాటించిన ఆదర్శ మూర్తి
సోదర స్నేహ ధర్మాలకు అర్థం చూపిన జానకీరాముడు మాటకు కట్టుబడిన
అయోధ్యా రాముడు క్షత్రియ యుద్ధ ధర్మాలను ఆచరించిన యుద్ధ వీరుడు
మనుష్య ధర్మాన్ని ఆచరించిన అవతార మూర్తి అన్నమో రామచంద్ర అన్నవారిని
ఆదుకున్న ధర్మ రక్షకుడు
రామ రాజ్యాన్ని సుభిక్షంగా ఏలిన ఆదర్శ ప్రభువు రామాయణ కథకు మేటి నాయకుడు
త్యాగం, ధర్మం, దయ, పరాక్రమంవంటి
గొప్ప గుణాలు కలిగిన
గుణవంతుడు దయా సముద్రుడు
ఆచార్య ఎం.రామనాథం నాయుడు, మైసూరు
+91 8762357996