పట్టుదల --ఐ. సత్య హైదరాబాద్

పట్టుదల --ఐ. సత్య హైదరాబాద్



ఒక సాధారణ మట్టి ప్రమిదలో 
ఒత్తి వేసి వెలిగిస్తే రాత్రంతా వెలుగుతుంది....
చీకటితో పోరాడుతుంది ..
మరి నీవు ఆ భగవంతుడే సృష్టించిన ప్రమిదవు...
అలాంటప్పుడు దేనికి భయం...?!!!

నీ పరిస్థితులకా...?!!
ఈ సమాజానికా..?!!
నీ మనఃసాక్షికా..?!!
ఈ లోకానికా..?!!
దేనికి....??దేనికి..??

నీ తప్పు లేనప్పుడు...
నీ ప్రమేయం లేనప్పుడు....
నీ మనసు కి నీవు సమాధానం చెప్పుకో - గలిగినప్పుడు....
నీ దారి రహదారి అయినప్పుడు...
ఇంక నీకు భయం దేనికి..?!!
దేనికి...?? దేనికి...??

లోకులు కాకులు....
వాటినైజమే అరవడం...!!
నీవు మంచి చేసినా....చెడు చేసినా..
అవి వాటి నైజాన్ని ప్రదర్శిస్తాయి.
అది తెలుసుకుని, ధైర్యంగా...!!
వేగంగా సాగిపో నీ లక్ష్యం వైపు...!!
విజయపథం నీ ఊపిరిగా...!!
సాహసం నీ సాధనగా..!!!!!

--సత్య
             🌼☘️🌼☘️🌼☘️🌼
 

0/Post a Comment/Comments