" చిన్నారులు " (బాలగేయం) -గద్వాల సోమన్న, గణితోపా ధ్యాయుడు

" చిన్నారులు " (బాలగేయం) -గద్వాల సోమన్న, గణితోపా ధ్యాయుడు

" చిన్నారులు " (బాలగేయం)
----------------------------------------

చల్లన మంచులాగ
మల్లె వోలె తెల్లన
పిల్లలు తేనెలాగ
పలుకెంతో తీయన

మెత్తన వెన్నలాగ
చిన్నారుల మనసులు
విరిసిన పూవులాగ
దివ్యమైన నగవులు

వెలిగే దివ్వెలాగ
మహోన్నతం తలపులు
మెరిసే తారలాగ
గృహమున చిన్నారులు

వీచే గాలిలాగ
జీవము పసిబిడ్డలు
పారే నదులులాగ
ఇష్టులు బహు శ్రేష్ఠులు

-గద్వాల సోమన్న,
గణితోపా ధ్యాయుడు 

0/Post a Comment/Comments