మన వినాయక చవితి ప్రాముఖ్యత --బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం.

మన వినాయక చవితి ప్రాముఖ్యత --బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం.

మన వినాయక చవితి ప్రాముఖ్యత
---------------------------------------------

పుణ్యప్రద భాద్రపద శుద్ధ చవితి
మన మహా వినాయకుని చవితి
ఉండ్రాళ్ళను భోంచేసే ఈ పండుగ
అంతా కలిసి చేద్దాం మది నిండగ !

మనసారా పూజిద్దాం వినాయకున్ని
విఘ్నాలు జరుగకుండా ఆ విగ్నేశ్వరున్ని
సిద్ధిబుద్ధి ఉన్న మన వినాయకుడు
సద్బుద్ధిని అందించే గణనాయకుడు !

పరమేశ్వర తనయుడు గణపతి
ప్రమథ గణాలకు తాను అధిపతి
అయ్యాడు ప్రమథ మహాగణపతి
అంతరిక్ష గణాలకు సర్వాధిపతి !

         విశాలమైన ఈ ప్రపంచము నందు నివసించు సమస్త జనులకు ఏలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడగల దైవం ఒకే ఒక  గణపతి అని, ఇతర ఏ దైవాలకు కూడా అట్టి శక్తి లేదని అష్టాదశ పురాణాలు వల్ల మనకు తెలియుచున్నది. అందుకే అందరూ గణపతిని" ఓం నమో విఘ్నే హరాయ గం గణపతయే నమః"అను ఈ మంత్రాన్ని జపిస్తూ పూజిస్తూనే ఉన్నారు. దైవ పురాణమందు ఈ విఘ్నేశ్వరున్ని "గుణేశుడు"అని వర్ణించారు. ప్రకృతిలోని సత్వ, రజో, తమో, గుణాది స్వరూపుడైనందున అలా ఆ దడ నాయకునికి ఆ పేరు వచ్చింది. మన మహా గణపతి వైదిక కాలము నుండి ఆర్యావర్తమైన భారతావనిలో ఆది దైవతా స్వరూపంగా ఉపాసింపబడుతున్నాడు. గుణేశుడే కాలగతి పరిణామ మందు "గణేశ" నామంగా పరిఢవిల్లిందని మన పూర్వ పెద్దల అభిప్రాయం.

              గణాపత్య సాంప్రదాయం ప్రకారం" గణం"అంటే సత్వ, రజో, తమో గుణ మిశ్రమం. ఈ త్రిగుణాధిపతి విగ్నేశ్వరుడు పురాణేతిహాసాలను బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక ఆ విధంగా కూడా గణపతి నామం సార్థకం అయిందన్నమాట. గణపతి విష్ణు స్వరూపం గలవాడు. పరమేశ్వర తనయుడు కూడా. "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం" అన్న ప్రస్తుతి ఇందుకు తార్కాణం బ్రహ్మవైవర్త పురాణానుసారం సత్వాది పతి శ్రీ మహావిష్ణువు మరియు యు పార్వతీదేవి పుణ్యక వ్రతానుష్టాన ఫలంగా ఆమెకు విష్ణు సత్వ రూపం గణేశుని ఆవిర్భావం అన్నమాట భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం వహించిన విఘ్నేశ్వరుని యధావిధిగా ఏకవింశతి పత్రాలతో అర్చించి తరించడం మన భారతదేశంలో తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న సంస్కృతి వినాయక పర్వదినాన్ని ఒక జాతీయ సమైక్య పర్వదినంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరియు యు ఇతర నాయకులు నిర్వహించారు. ఆ మహా నాయకుల అడుగుజాడల్లో ఆనాటినుండి మన వినాయక చవితి ని వాడవాడలా వైభవోపేతంగా మనం జరుపుకుంటూ వస్తూనే ఉన్నాం.
         
 "గణం" అంటే. గుంపు అని అర్థం. ఇది సామాన్యులు అర్థం చేసుకునే పరమార్థం. కానీ వేదం చెప్పే అర్థం వేరుగా ఉంది. గణం అంటే రుద్రలోకంలోని స్పందనాత్మకమైన చైతన్య గణాలు. ఈ గుణాలనే మనం పంచ భూతాలుగా, పంచతన్మాత్రలుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ కర్మేంద్రియాలుగా గుర్తిస్తున్నాం. వీటిని భూత గణాలని అంటారు. వీరు జీవులు ఆచరించే కర్మలను బట్టి వారికి ఆయా ఫలితాలను ఇస్తూ వాళ్ల మనసులను మథనం చేస్తుంటారు. కాబట్టి వీరిని ప్రమథగణాలని అంటారు. వీరందరూ పై  ఆధిపత్యం గల వినాయకునిప్రమథ మహాగణపతి
అని పిలుస్తారు. ఎక్కడ అ మహా శబ్దం గొప్ప అనే అర్థానికి పరిమితం కాలేదు. అంతరిక్ష గణాలను "మహా" అనే మంత్రంగా సంభోగించడం ఒక సాంప్రదాయంగా వస్తూనే ఉంది. ఈ గణాలకు అధిపతు లైన గణాధిపతులు విశ్వాస, నిశ్వాసాత్మకాలైన ఉచ్చారణ రూపాలుగా ఉంటాయి కనుక మీరు శబ్ద గణాలకు, వాగ్గణాలకు తదాపి సకల విద్యలకు అధిపతులు. వీరి ఉచ్ఛ్వాస ని శ్వాస మార్గమే వినాయకుని తొండంగా రూపకల్పన చేయబడింది. కాబట్టి గజాననులుగా ఆరాధింప బడుతున్నారు. 

శ్వాసకు మూలం ఓంకారం. 
వీరుప్రణవం బాహ్య రూపాలు. 
వీరందరిపైన ఆధిపత్యం వహించే వాడు శ్రీ మహాగణపతి.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి,
సెల్ నెంబర్ 9491387977,
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments