త్యాగముతో అమృతత్వము "త్యాగేనైక అమృతత్వ మానశుః" - దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

త్యాగముతో అమృతత్వము "త్యాగేనైక అమృతత్వ మానశుః" - దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

త్యాగముతో అమృతత్వము

"త్యాగేనైక అమృతత్వ మానశుః"
మానవుడు త్యాగ నిరతిని పెంచుకోవాలి. అహంకార మమకారాలు మానవులని కట్టి వేస్తున్నాయి. ఇవి మానవుడిని నరకానికి తీసుకువెళతాయి. యమధర్మరాజు పాశాన్ని వేసి ప్రాణాలు లాగినట్లు, మన క్రోధాలు, పాపపు పనులు వలనే గొంతు పాశము గా మారి పోతున్నాయి. నీది, నాది అను బేధము మాని మనది అనే మంచి మనసుని ఏర్పరుచు కోవాలి. ప్రేమ, విశ్వాసములను పెంచుకోవాలి.

"ఆహం ఏతత్" దీనికి మించిన జ్ఞానము ఈ లోకంన లేదు. మనస్సుకి అతీతమైన తత్వమే ఆత్మతత్వము. దీనిని అర్థం చేసుకొనలేక మనిషి అజ్ఞాని గా మారుతున్నాడు.
పురాణాలను మనం చక్కగా విచారించి బోధపరుచుకోవాలి . ఆదర్శములను అలక్ష్యం చేయకూడదు.  త్యాగమయమైన కర్మ దీక్ష మనకు ఆదర్శం కావాలి. ప్రతి దినము ఆరాధనలు చేసి తృప్తి పడటం కాదు. సాంప్రదాయ సంస్కారాలను, సంకల్పాలను అలవర్చుకోవాలి. 
సాత్విక ఆహార లక్షణాలను అలవాటు చేసుకోవాలి. మనస్సుని, బుద్ధిని, దేహాన్ని కూడా శక్తివంతం చేసేది ఈ సాత్విక ఆహారం అని గుర్తుంచుకోవాలి. దానితోనే త్యాగ భావాలు ఏర్పడతాయి అని గ్రహించాలి.

త్యాగం అనేది ఓ గొప్ప శక్తి . త్యాగం తో సహనాన్ని కూడా అలవర్చుకోవాలి. త్యాగ గుణం తమోగుణం చేతనే ఏర్పడుతుంది. నిజమైన సుఖం కలగాలంటే త్యాగమే సరైన పద్దతి. మనసా వాచా కర్మణా త్యాగం చేయటమే నిజమైన సత్య సమాన త్యాగ భావం
విషయ వాసనలు వదిలి, అపవిత్రతను వదిలి దృఢ సంకల్పం తో త్యాగనిరత భావమును ఏర్పర్చుకోవాలి.
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ భగవంతుని పై అపార నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమానుగుణాలు ఉంటాయి. భగవంతుడు ఒక్క భక్తి విశ్వాసాలకే లొంగుతాడని విశ్వసించాలి.

కాలాన్ని అపవిత్రం చేయక సద్వినియోగం చేస్తే పామరుడు పరమహంస అవుతాడు. త్యాగబుద్దితో పరమహంస పరమాత్మ అవుతాడు. జీవితంలో ప్రతి మనిషి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది తీరాలి అని సాయి వచనం. 

సకల ఆధ్యాత్మిక సాధనలో నామస్మరణ కి మించిన సులువైన మార్గం లేదని, నిరంతరం భగవంతుని ఆలోచనలతో భగవన్నామాన్ని మననం చేసుకుంటూ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్యాగ భావాలతో దైవీ గుణాలు అలవడుతాయి. దైవీ గుణాలను సర్వదా తలిచేవారికి మంచి మార్గమునే నడవాలి అనే ప్రేరణ కలుగుతుంది. మోక్ష సాధనకు త్యాగతత్వమే సరి అయిన మార్గము.

సాధన చేసి త్యాగ భావము తో నడిచి అందరికీ ఆదర్శ మార్గదర్శకం కావాలి అని కోరుకుంటున్నాను
ఓం శ్రీ సాయి రాం


- దొడ్డపనేని శ్రీ విద్య,
విజయవాడ.


0/Post a Comment/Comments