గురజాడ
తెలుగు వెలుగుల జాడ
నవతరం కవుల అడుగుజాడ
మహా మనిషి గురుజాడ //
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని భరతమాత పై ప్రేమను చాటిన మహనీయుడు //
సున్నిత భావాల సుగంధాల మల్లెలమ్మ పూర్ణమ్మ అంటూ రాతి గుండెను సైతం కరిగించిన సంఘసంస్కర్త //
కన్యాశుల్కం లో గిరీశం మధురవాణి పాత్ర లతో సమాజాన్ని కదిలించిన మానవతావాది//
కొత్త బాణిలో కవిత్వానికి రూపమిచ్చి మాత్రాఛందస్సుల కు శ్రీకారం చుట్టిన తెలుగు జాతి వైతాళికుడు//
అతివల చదువుసంధ్యలకు ఆద్యూడై
స్త్రీ చైతన్యానికి జీవనాడైనా
నవయుగ సాహితీ నాయకుడా
అందుకో మా కవిత అక్షరమాల. //