అతివృష్టి - మణి పూసలు --వడ్ల నర్సింహా చారి

అతివృష్టి - మణి పూసలు --వడ్ల నర్సింహా చారి

🌼అతి వృష్టి - మణిపూసలు🌼
~~~~వి.నర్సింహా చారి
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

చినుకులన్ని ఏకమాయె
ప్రవాహంగ మారిపాయె
నదులల్లో కలిసియిపుడు
వరదలతో పొంగిపాయె!!

అతివృష్టిని కలిగించెను
పంట నీట ముంచేసెను
తెలుగు రాష్ట్ర ప్రజలందరి
ఆశలనే త్రుంచేసెను!!

జీవజాతి ఆక్రందన
రైతన్నల ఆవేదన
ఎటుచూసినగానవచ్చె
దుర్బరమగు ఈ రోదన!!

ఆకలి మంటలురేగెను
పొలములజలములు నిండెను
ఈప్రకృతి విలయంతో
మనసులు బాధకు కుంగెను!!

ఊర్లను జనులును వదిలిరి
పట్టణవైపుకు కదిలిరి
బ్రతుకు భారమైతోచగ
పూట తిండికై వెదికిరి!!

దేవుడే కరుణించాలి
వరుణుడే శాంతించాలి
తోటివారి కిపుడుమనము
చేయూతనందించాలి!!

......✍️మణికర్ణిక🌹☘️ 

0/Post a Comment/Comments