మానవ దేవుడు
శ్రీ రాముని చరితము
ఆనంద భరితము
శ్రీ రామకావ్యము
అమృత భరితము
శ్రీరాముడు జగదభిరాముడు
నీలిమేఘశ్యాముడు లోకరక్షకుడు
జనాశ్రీతపాలకుడు జనసంరక్షకుడు
అయోధ్యను ఏలిన మానవ దేవుడు
మాధవుడే మానవుడు గా పుట్టిన కావ్యము
జగతికి ఎన్నో నైతికవిలువలు నేర్పిన కావ్యము
వాల్మీకి కలం నుండి జాలువారిన అద్భుత కావ్యము
రసరమ్యమైన మధురాతి మధురమైన కావ్యము
ప్రజా సంక్షేమం కోరిన రాజు వైనం
తండ్రి మాట యవదాటాని కొడుకువైనం
భర్త వెంట భార్య అనే అపురూప దాంపత్య వైనం
సఖ్యత కలిగిన అన్నదమ్ముల సమైక్యత వైనం
ఓకే మాట ఓకే బాట ఓకే ఆయుధం అనే విధానం
పర స్త్రీ కాంక్ష వల్ల జరిగే పతన విధానం
దైవభక్తి గురుభక్తి పితృవాక్యపరిపాలన విధానం
ఇంటిగుట్టు లంకచేటు అనే నానుడి చెప్పే విధానం
నేడు గతి తప్పుతున్న ప్రపంచానికి ఒక ఆదర్శ కావ్యం రామాయణం
పాశ్చాత్య దేశాలు సైతం ఆదరిస్తున్న ఆదర్శ కావ్యం
జగతి భవితకు ఒక నిత్య మార్గదర్శి గల కావ్యం
మానవజన్మ పునీతం చేసిన అపురూప కావ్యం శ్రీ రామాయణ కావ్యం
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు
విజయనగరం జిల్లా