జీవితం ...ముత్యాలహారం(పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)

జీవితం ...ముత్యాలహారం(పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)

*జీవితం* ముత్యాలహారం

జీవితం తీయనికల
నెరవేరాలి మన కల
మెరిపించాలి మిలమిల
అగుపించాలి కళకళ

అందమైనది జీవితం
అమృతమైన జీవితం
పునీతమైన జీవితం
పుణ్యఫలం జీవితం

సమస్యను శోధించాలి
ఫలితం సాధించాలి
ప్రగతి చూపించాలి
అన్నీ అధిగమించాలి

జీవితం ఒక లక్ష్యం
చేయకు నిర్లక్ష్యం
సాధించు నీ లక్ష్యం
పూరించు నీ లక్ష్యం

ఇదే మానవజన్మ 
చెప్పలేం పునర్జన్మ
అనుభవించాలి కర్మ
మంచి పనులే సత్కర్మ

శాశ్వతం కాదు దేహం
తీర్చుకో నీ దాహం
విడవాలి నీ అహం
తెలుసుకో జీవిత ఇహం

బంధాలు అనుబంధాలు
రక్త సంబంధాలు
బంధు మిత్ర బంధాలు
ఇవే మానవ బంధాలు

ఒంటరిగా వచ్చాం
ఒంటరిగానే పోతాం
కాళీగానే వచ్చాం
కాళీగానే పోతాం

అంతా దైవమయం
చేసుకో ప్రేమమయం
దేవుడే నీకు అభయం
అందుకే విడువు భయం

ఆలోచన ఉన్నతం
ఆచరణ సమున్నతం
ఆదరణ మహోన్నతం
జీవితం అభ్యున్నతం      

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
           9441530829

0/Post a Comment/Comments