చింతామణి --శ్రీమతి సత్య మొం డ్రేటి

చింతామణి --శ్రీమతి సత్య మొం డ్రేటి




వందనం మీకు అభివందనం
పోప్ ఇండియన్ జర్నలిజం గా పేరుపొందిన మీకు శతకోటి వందనాలు.
ఆంధ్రాలో మణిదీపం మై పుట్టి అలహాబాదులో అరుదైన కీర్తి ప్రతిష్టలను సంపాదించిన తెలుగు జాతి వజ్రం
జర్నలిజంలో మీదైన శైలిలో స్వాతంత్ర సమర కర్తగా ఉద్యమించిన మహానుభావుడవు నీవు
విజయనగర సామ్రాజ్యం లో ఉదయించిన కీర్తి తురాయి నీవు.. పట్టాలు లేని పండితుడు నీవు ఉపన్యాస
వీరుడవే... నీ వాగ్దాటి కి తిరుగు లేదు.
పత్రికా రంగానికి ఎనలేని సేవ చేసిన మహాత్ముడవు నీవు
రాజకీయ నాయకుడిగా దేశానికి ఎంతో సేవ చేశావు
బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది
అలహాబాద్ విశ్వవిద్యాలయం డిలీట్ గౌరవ పట్టాను ఇచ్చిం ది
ఆంధ్రుల ప్రతిభాపాటవాలను భారతదేశమంతటా చాటిన చింతామణి నీవు
చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డావు 1941 జులై 1న నీవు పరమపదించిన భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఓ మహానుభావా అనంత కోటి వందనాలు నీకు.....

పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
ప్రక్రియ వచనం


0/Post a Comment/Comments