ఎన్నికల సంస్కరణలు జరుగాలి --మార్గం కృష్ణ మూర్తి

ఎన్నికల సంస్కరణలు జరుగాలి --మార్గం కృష్ణ మూర్తి


- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: "ఎన్నికల సంస్కరణలు జరుగాలి"

ప్రక్రియ: తొణుకులు
రూపకర్త: శ్రీ ప్రశాంత్ కుమార్ ఎల్మల

01.
నేత ఒకే చోట పోటీ చేయాలి
అది ఎక్కడైననూ కావచ్చు
నేడు ఓటు హక్కు అందరికీ
పద్దెనిమిది నిండినా వచ్చు

02.
ఒకే మంత్రి ఒకే రాష్ట్రపతి
ఆనవాయితీగా ఉన్నపుడు
ఒకే ఎన్నికల అధికారనే
విధానం ఉండాలి యిప్పుడు

03.
ఎవరు చేసిన అప్పులకు
వారినే భాద్యులను చేయాలి!
ఎవరు తెచ్చే అప్పులకైనా
కేంధ్రప్రభుత్వనియంత్రణుండాలి!!

04.
రాష్ట్రాలు చేసే అప్పులను
ఉచితాలకు వాడకూడదు
రాష్ట్రాలు వ్యయాల రూపేణ
ప్రక్కదారి పట్టించకూడదు

05.
ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ
తప్పక జారీ చేయవలెను!
ఆధార్ కార్డు ఉన్న వారే
ఎన్నికల్లో నిలబడవలెను!!

06.
జైలు జీవితం మూడేండ్లకుమించి
నట్లైతే పోటి చేయకూడదు!
జైలునుండి క్రిమినలెవరైనా
ఎన్నికల్లో పోటి చేయకూడదు

07.
ఒక  నేతను ఒక పదవికే
అర్హుడిని చేయవలయును
ఒకటి కంటే ఎక్కువగా నున్న
పదవిని తొలగించవలెను

08.
ప్రతి ఒక్కరికీ ఒకే ఒక
ఆధారు కార్డు ఉన్నట్లుగా
ప్రతి ఒక్కరికీ ఒకే ఒక
బ్యాంకు అకౌంటు ఉండాలిగా!

09.
సామాన్యులు డిపార్ట్ మెంట్లకు
వెంటనే దొరికి పోతున్నారు
సామాన్యులు చిక్కినట్లుగా
నేతలు దొరుకకుంటున్నారు

10.
ఓటు వేసిన ప్రజలకు
ఒక రకమైన న్యాయమా?
ఓటు వేయించు కున్న నేతలకు
మరొకమైనట్టి న్యాయమా?

11.
వందకోట్ల సంపద మించినచో
పోటీకి అనర్హులను చేయాలి
వంద కోట్ల సంపద లేనిచో
ఎన్నికకు అర్హులను చేయాలి

12.
యాబది ఎకరాల భూముంటే
పోటికి అనర్హులను చేయాలి
యాబదెకరాల భూమిలేనిచో
ఎన్నికకు అర్హులను చేయాలి


- మార్గం కృష్ణమూర్తి












0/Post a Comment/Comments