"సహజ కవి పోతన" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"సహజ కవి పోతన" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

సహజ కవి పోతన


ప్రాచీన తెలుగు సాహిత్యంలో
జన ప్రియమైన భక్తకవి పోతన
జీవితాన్ని భక్తి భరితం
కవిత్వాన్ని భక్తిమయం చేసిన
నిరాడంబరుడు
సిరి సంపదలను తృణ ప్రాయంగా
త్యజించిన త్యాగ మూర్తి
సరస్వతీ దేవి కంట నీరు
తుడిచిన పవిత్ర మూర్తి
శివకేశవ భేదం లేని
ఆదర్శ మూర్తి, వినయశీలి
అచ్చమైన తెలుగు తనం
అద్భుతమైన సాంస్కృతిక
వైభవం చాటిన పండితకవి
కథా కథనంలో నేర్పరితనం
కవితా నిర్మాణంలో చతురత
కలిగిన కృషీవలుడు
పండిత పామరులకు
కవితామృతాన్ని అందించి
తెలుగు పదాల పద్యాల వైభవాన్ని
చాటిన సహజ కవి వర్యుడు
మన పోతనా మాత్యుడు

పేరు: ఆచార్య ఎం రామనాథం నాయుడు
ఊరు: మైసూరు
చరవాణి: +918762357996

0/Post a Comment/Comments