అక్షర క్రమ కవిత --ఐశ్వర్య రెడ్డి

అక్షర క్రమ కవిత --ఐశ్వర్య రెడ్డి

 
అక్షర క్రమ కవిత
సాంకేతిక మాయ నవమానవతరము

సాం కేతికత పెరుగుతున్న సమయంలో 
కే రింతల బాల్యం కనుమరుగవుతుంది
 తి కమక బ్రతుకుల గందరగోళంలో
 క లిమిలేములు తేడాలు లేక 
మా యాలోకం లో చరవాని మత్తులో
  య ధార్థం లో బ్రతకడం మానేసి
  న వనాగరికత అన్న భ్రమలో 
వ లువలు విడిచి నీతినియమాలు వదిలేస్తే 
మా ర్పు మంచికేనంటూ సర్దుకుపోతుంటే పెద్దలు 
న వశకానికి నాంది పలికే యువత మాయా ప్రపంచం లో జోగుతుంటే 
వ యోవృద్ధులై వెకిలి నవ్వు నవ్వుతంటె 
త లంచుకొని నిలుచుంది నా తల్లి భరతమాత 
ర గులుతున్న హృదయంతో మార్పు కావాలంటూ
 ము సురుకున్న చీకట్లు తొలగిపోవాలంటూ సాంకేతికత అభివృద్ధి కోసమే గాని చెడిపోవడానికి కాదు అని చెప్తూ...... 

ఐశ్వర్య రెడ్డి గంట
హైదరాబాద్


2/Post a Comment/Comments