సృష్టి కోరిక... బాలు మొదటి వర్ధంతి సందర్బంగా ---ఉమశేషారావు వైద్య

సృష్టి కోరిక... బాలు మొదటి వర్ధంతి సందర్బంగా ---ఉమశేషారావు వైద్య



సృష్టి కోరిక(బాలు వర్ధంతి)

ఓ బాలు నీవు ఒకచరితం
నీజన్మ కారుణజన్మమం
నీకు మరణంలేదు

నీవు సూర్యుని ఉషస్సు
చంద్రుని ప్రభ 
సంగీతం సప్త స్వా రాలు
వీడదీయ లేము

నీ గొంతునుంచి 45 వేల కు
పైగా ఒక జీవనది ప్రవాహికలా నవరసాలు

జోలి పాట నుండి జీవన్ ముక్తి వరకు
ప్రేమ నుంచి ప్రమోదగీతాలు

హాస్యం నుండి
హృద్యం వరకు
పాడిన పాటలు
ఆకాశవాణి నుండి
యూట్యూబ్ 
బుల్లితెర నుంచి బుల్లి సెల్లులో కూడా గాళ్ళు గాళ్ళు మని శ్రావణం అయ్యి ద్వానిస్తూనే
ఉంటాయి

నీ గళం మాకొక వరం !!!
ఎంత ఎదిగిన ఒదిగి వుండే..  
                  బాలభానుడివా??
అందరి మనసులను దోచిన
మహానుభావుడివి...!!
నీ తీయని పాటలతో జగత్తుని
    ఉర్రూతలూగించిన మధురగాయకా..
నీ మాటలే మంత్రాలై...
ప్రతీ తెలుగువాడి గుండెల్లో
మారుమ్రోగుతున్నాయి.....
దివి కేగిన గాన గంధర్వా...
ఒకసారి ఇటు చూడు...
ఈ లోకం ఎంత చిన్నబోయిందో!!!
ఈ భువి కన్నీటి సంద్రమైంది!!!...
మళ్ళీ నీవు జన్మించాలి...
నీ గానం వినిపించాలి...
 
ఉమశేషారావు వైద్య
దోమకొండ

0/Post a Comment/Comments