సర్వేంద్రియానం నయనం ప్రధానం...
సుందర ముఖారవిందాన
పద్మ రేకుల నయనాలు...
ప్రకృతి అందాలను వీక్షించే సాధనాలు...
కనుల కడలిలో ఎన్నెన్నో అనుభవాల పడవలు
అల్లకల్లోల నావలు కొన్ని
ఆనందాల నిలయాలు కొన్ని
జుగుప్సాకర దృశ్యాలు చూడలేని సులోచనాలు.....
రెప్పల తలుపులు మూస్తాయి
మారణకాండపు దృశ్యాలు కనలేని కనులు హిమధారలను ఆశ్రయిస్తాయి...
మానవ జీవితం లో కనులే ప్రధానం.... సర్వకాల సర్వావస్థల ను కనులే హృదయానికి సంకేతాన్ని అందిస్తాయి....
అందుకే చెడు చూడొద్దు అన్నారు మహాత్ములు......
కనుల వీక్షణ తో సర్వం సఫలం
చూపులేని బ్రతుకు అంధకారం
పేరు ;శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు :హైదరాబాద్
చరవాణి :94 90 2 3 9 5 8 1
ప్రక్రియ: వచనం