మాస్క్ గణపయ్య --డా. విడి రాజగోపాల్

మాస్క్ గణపయ్య --డా. విడి రాజగోపాల్

మాస్క్ గణపయ్య

మా బొజ్జ గణపయ్య
మా బాధలు చూడయ్య
ఏటా పోటీపడి  ఆకాశం తాకేలా
నీ విగ్రహాలు వెలసేవి
ఏ వీధిచూసినా నీవే

కరోనా వచ్చింది
అందరినీ కట్టేసింది
గత ఏడాది పొత్తిగా
వెల వెల పోయింది నీ పండుగ
ఈ ఏడాది కాస్త మేలు

మేమిచ్చే ఉండ్రాళ్ళు
మేమిచ్చే కుడుములు
నిండుగా ఆరగిస్తావు
నవరాత్రులు పూజలు
పెద్ద పెద్ద ఊరేగింపులు

మరి మా బాధలు కనవా
మీ ముద్దుల అమ్మ పార్వతమ్మకు
మీ ప్రీతి పాత్రుడు శివయ్యకు
విన్నవించవా మా బాధలు

మీ ఊరేగింపులో చిందులేసిన
కొందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు
ఊరేగిపోయారు కరోనా దెబ్బకు
ఇలానే ఉంటే భూలోకంలో
మీకు పూజలందవు ఓ గణపయ్య

దేవతలందరూ ఏకమై ఈ
కరోనారూపాన మళ్లీ వచ్చిన
ఈ నరకాసురుని ఈ హిరణ్యకశిపుని
ఈ రావణాసురుని  ఈ భస్మాసురుని
సంహరించ  రండి రారండి

డా విడి రాజగోపాల్
9505690690


0/Post a Comment/Comments