సృష్టికి మూలం గా మిగిలిన మగువా -- శ్రీమతి సత్య మొం డ్రేటి

సృష్టికి మూలం గా మిగిలిన మగువా -- శ్రీమతి సత్య మొం డ్రేటి
సృష్టికి మూలం గా మిగిలిన మగువా

ప్రదర్శించు నీ తెగువ
సాధించి చూపించు నీ విలువ

బాల్య వివాహా లను
సతీసహగమనాలను

దాటుకుని సాగిపోయావు ముందుకు...

కన్యాశుల్కాన్ని వరకట్నాన్ని
కడతేర్చి వడివడిగా సాగి పోయావు..

పరాయి పాలనలో నీకు రక్షణ కోసం  గృహ బంధన చేశారు నిన్ను...

ఎందరో సంఘసంస్కర్తల ఆశయాల పందిరి వై విద్యా విశారద గా విలసిల్లావు.


ఇందు కలవు అందులో లేవు అన్నట్లుగా అన్ని చోట్లా అన్ని రంగాలలో పంచభూతాలలో నీ విజయ కేతనాన్ని ఎగురవేసా వు.

చాంద్ ఆస్తుల భావాలతో ఏకీభవించక ఆధునికంగా ఆలోచిస్తూ  ఈ సత్ పురోగతికి పునాదులు వేసావు.

ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పరిచావు. కుటుంబ సంక్షేమానికి పాటుపడుతూ
సంతానాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దావు.

 నీఅభ్యుదయాలే...... ఎన్నో సాధించిన ఓ మహిళా నువ్వు కన్న పురుషుడే  నీకు శత్రువు అయ్యాడు... నీ గమనానికి అవరోధం కలిగిస్తున్నాడు...

లైంగిక వేధింపులకు కారణమవుతున్నాడు... తల్లి చెల్లి  అక్క  అందరూ స్త్రీలని మరచి పరాయి స్త్రీలనుపైశాచికంగా వేధిస్తున్నారు....
అపర కాళీ ఆదిశక్తి మహిళ
ఆదరిస్తే ఆప్యాయత నిస్తుంది
ఎదురుతిరిగితే చీల్చి చెండాడుతూ ఉంది... అదే మగువ లోని తెగువ........

పేరు :శ్రీమతి సత్య మొం డ్రె టి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ: వచనం
హామీ పత్రం: కవిత నా సొంతం దేనికి అనువాదం అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments