కలియుగం - ముత్యాలహారం
ఇదే నేటి కలియుగం
ఇదే ఆకలియుగం
ఇదే అరాచకయుగం
ఇదే అవినీతియుగం
కాలం కానీ కాలం
టెక్నాలజీ కాలం
నెట్వర్కుల కాలం
దగా మోసాల కాలం
దౌర్జన్యమైన కాలం
దోపిడీల కాలం
దుర్మార్గుల కాలం
దగాకోరుల కాలం
ఉన్మాదుల కాలం
మతోన్మాదుల కాలం
మాత్సర్యాల కాలం
మదమెక్కిన కాలం
నమ్మకాలు తక్కువ
అపనమ్మకాలు ఎక్కువ
భావోద్రేకాలెక్కువ
ఐకమత్యం తక్కువ
సమత మమతలు లేవు
సామరస్యతలు లేవు
సాత్వికత సహనం లేవు
స్వార్ధం ఈర్ష్యా పోవు
అహంకారం ఎక్కువ
అపార్ధాలు ఎక్కువ
అన్యాయాలు ఎక్కువ
ఆక్రందన లు ఎక్కువ
చెప్పేవారు ఎక్కువ
వినేవారు తక్కువ
చెడుతనాలు ఎక్కువ
సహాయాలు తక్కువ
ఉండదు మానవత్వం
కనపడదు ఆ తత్వం
ఉండని సమానత్వం
అదే నేటి తత్వం
ఈ కాలం మారాలి
మార్పు మనం తేవాలి
అందరు చేయి కలపాలి
భవితను సరి చేయాలి
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు