తెలంగాణ ఆరాధ్యుడు(కైతికాలు) ---కల్వల రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ ఆరాధ్యుడు(కైతికాలు) ---కల్వల రాజశేఖర్ రెడ్డి

నా గొడవను సృష్టించి
గొడవకు దిగినాడు
తెలంగాణ మాదంటూ
నిజాంను ఎదిరించాడు
అతడే!కాళోజీ
తెలంగాణ వైతాళికుడు

ప్రజల భాషకు నీవు
ఆద్యుడవైనావు
తెలంగాణ ప్రజలకు
ఆరాధ్యుడైనావు
నిజామును ఎదిరించి
మాకు ధైర్యాన్ని పంచావు

జైలు గోడల పైన
అక్షరాలను చెక్కావు
తెలంగాణ ఆకాంక్షను
ఎలుగెత్తి చాటావు
వారెవ్వా! కాళోజీ
తెలంగాణా నేతాజీ

తెలంగాణ యాస భాష
లెస్స యని పలికినావు
తెలుగు మాండలికాన్ని
ప్రపంచానికి చాటావు
వారెవ్వా! కాళోజీ
తెలంగాణ పోరు గొప్పదని చాటావు

తుపాకీ పట్టనట్టి
వీర సైనికుడివి
ఆయుధం ధరించని
తెలంగాణ వీరుడివి
ప్రజలను నడిపించిన
మహా నాయకుడువి

తెలంగాణ ప్రహ్లాదుడిని
కాపాడినట్టి విష్ణువి
హిరణ్యక నిజాంని
ఎదిరించిన ధీరుడివి
వారెవ్వా! కాళోజీ
ప్రజల గుండెల్లో వెలుగైనావు

కలశం,కమండలం
పట్టని మహర్షివి
తెలంగాణ తపస్సును
చేసినట్టి ఋషివి
వారెవ్వా! కాళోజీ
ధర్మవైపు సాగినావు

భారతదేశ చిత్రం
నిజాం పాలనలో
మన బతుకులు విచిత్రం
ఆంగ్లేయుల పాలనలో
బానిస సంకెళ్లను తెంచి
బతుకు బాట చూపినారు

--కల్వల రాజశేఖర్ రెడ్డి.

0/Post a Comment/Comments