గురుపూజ్యులు
గురువులకే గురువు *సర్వేపల్లి గారు*
ఎందరికో స్పూర్తి ప్రదాత అంతటి వారు
అందరికీ గర్వకారణమైన ఆచార్యులు వీరు
పలువురికి మార్గదర్శకం గా వెలిగినారు.
ప్రతిభా పాటవాలతో ఉన్నత శిఖరాలు చేరినారు.
నాలుగు దశాబ్దాల పాటు ఉపాద్యాయ వృత్తిలో కొనసాగినారు
తిరుపతి సమీపంలోని తిరుత్తణిలో జన్మించినారు
బాల్యం నుంచే అసాధారణ ప్రతిభ కనబరిచినారు
భారతీయ తత్వశాస్త్రంలో గ్రంధం రచించినారు
తన ప్రసంగాలతో యువతను ఉత్తేజ పరిచినారు
ప్రభుత్వం వారు భారతరత్న తో సత్కరించినారు
ఉన్నత భావాలు కలిగిన మానవతావాది వీరు
వివేకాన్ని, విమర్శనాశక్తిని పెంచుకోమన్నారు.
అక్షర జ్ఞానం అజ్జనాన్ని తొలగిస్తుందని నమ్మినారు
తరగతి గది ఓ న్యాయ స్థానం అని ప్రభోదించినారు.
తాత్వికచింతనలో పాశ్చాత్యతత్వాన్ని ప్రవేశ పెట్టిన ఘనులు వీరు
ఎన్నో పదవులలో రాణించిన ఉన్నతులు వీరు
తన భావాలను సాహితీ సదస్సులలో చాటినారు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గౌరవ పురస్కారాలు పొందినారు
--దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
05/09/2021