అవినీతిపై అక్షరయుద్ధం ---వి. కృష్ణవేణి

అవినీతిపై అక్షరయుద్ధం ---వి. కృష్ణవేణి

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా..

అవినీతిపై అక్షరయుద్ధం.

అవినీతి మూలాలు కనుక్కుని అంతమొందించడానికి 
యువకులలో చైతన్యం వచ్చేలా ప్రోత్సహిస్తూ..
విద్యార్థిస్థాయి నుండి అవగాహన కల్పిస్తూ..
అవినీతిని  అంతమొందించే పరిష్కరానికి ముందుగా
మౌలిక పరిశీలన కొనసాగిస్తూ..
విద్యావిధానంలో  జరిగే అవినీతిని,
రాజకీయనాయకుల అవినీతిని విచారించగలిగేలా పత్రికల ద్వారా
వివిధ ప్రచారాల ద్వారా ప్రజలలో 
చైతన్యాన్ని రేకెత్తించగలగాలి..
రాజకీయవ్యవస్థ, అధికారవ్యవస్థ, న్యాయ వ్యవస్థ 
అవినీతిని అరికట్టడానికి ఎంతో కృషి చేయాలి.
ఒక్క చిర్రాచుక్క లక్షమెదళ్లకు  కదలిక అన్నట్టు
చైతన్యవంతమైన రచనలతో..
విద్యావ్యవస్థలో జరిగే అవినీతివల్ల దుర్వీర్యమైపోతున్న 
విద్యావిధానాన్ని కాపాడుకోవడానికి యువతను మేల్కొల్పేలా
అక్షరయుద్ధం కురిపిస్తూ..
అవినీతి ఆక్రమణ వల్ల  సరైన గిట్టుబాటు ధరలేక 
నష్టపోతున్న రైతన్నకు అండగా పోరాటం చేస్తూ..
వారిలో తిరుగుబాటు తనాన్ని చూపిస్తూ..
ప్రభుత్వపాలనా విధానంలో లోపాలను వెలిగెత్తి
అభివృద్ధి మార్గాలను చూపిస్తూ..
పేద,మధ్యతరగతుల వారికి దూరమవుతున్న ఎన్నో పథకాలను, 
అక్రమార్కుల వల్ల వారికి జరిగే  నష్టాలను..
ప్రభుత్వానికి తెలియచేయుటకు ప్రచారాన్ని సాగిస్తూ..
అందుబాటులో ఉన్నా పత్రికల ద్వారా..
సమాచారమాధ్యమాల  ఉద్యమాన్ని కొనసాగిస్తూ...
ప్రభుత్వపాలనా విధానంలో మార్పును..
అవినీతికి పాల్పడిన అధికారవ్యవస్థను..
దగాకోరుల, దందాకోరులవ్యవస్థను  
రూపుమాపుటకు నిరంతరపోరాటం చేస్తూ...
ప్రజలలో చైతన్యం కలిగేలా కవులు, పాఠకులు,
పత్రికాసంపాదకులు, యువకులు కృషి చేస్తూ.
అవినీతిని రూపుమాపాలి.


వి. కృష్ణవేణి.
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా
9030226222
 
 
ప్రక్రియ :వచనం 
 
 

0/Post a Comment/Comments