ఆటలు (ఆటలు ఆగమౌతున్నవి క్రీడల్లో రాజకీయాల జోక్యం తగ్గాలి) ...ఉమశేషారావు వైద్య

ఆటలు (ఆటలు ఆగమౌతున్నవి క్రీడల్లో రాజకీయాల జోక్యం తగ్గాలి) ...ఉమశేషారావు వైద్య


మూల పడ్డాయి
గ్రామీణ క్రీడలు
అమావాస్య చీకట్లో చిక్కుకున్నాయి

క్రికెట్ మోజులో భారత్ లో
పుట్టిన హాకీ ఆగం అయిపోయింది
అథ్లెటిక్స్ క్రీడా రాజకీయాల్లో 
కిరికిరి అయి కూర్చున్నాయి

ఆటల అసోసియేషన్ ల
అడుగులకు మడుగులొత్తే
రోజులు పోవాలి
ఆట విద్యలో భాగం కావాలి

నేర్పే తీరు మారాలి
ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరగాలి
నిజమైన క్రీడాకారులకు బతుకును ఇవ్వాలి

అప్పుడప్పుడు పేపర్స్ లో
భిక్షమెత్తుకున్న క్రీడాకారుడు
కూలీగా అవతారమెత్తిన బాక్సర్
ఆనాడు దేశానికి పేరు 
నేడు కూడు గతి తప్పే

అందుకే
క్రీ డాలు ఎదుగాలి
రాజకీయ క్రీడలు ముగియాలి
క్రీడా విద్యకు ఊతం ఇవ్వాలి

-ఉమశేషారావు వైద్య,
లెక్చరర్, కామారెడ్డి,
9440408080

0/Post a Comment/Comments