- మార్గం కృష్ణ మూర్తి
భాద్రపద మాసం విశిష్టత
మాసములలో ఆరవది
వర్ష ఋతువులో రెండవది
చంద్రదర్శన భద్రతలకు,మరెన్నో విశిష్టతలకు
మారుపేరు ఈ భాద్రపద మాసము!
పౌర్ణమి తిధిన ,చంద్రుడు ఉత్తర భాద్రపద నక్షత్రం
పూర్వ భాద్ర పద నక్షత్రం చేరువలలో నున్నపుడే
వచ్చు మాసమే భాద్ర పద మాసము
అని చెప్పుచుండెను జోతిష్య శాస్త్రము!
భాద్రపదమాసమునకుండే నెన్నియోవిశిష్టతలు
శుక్ష పక్ష పాడ్యమి నుండి చతుర్ధశి వరకు
పండుగలు ఉత్సవాలతో పరవశించేరు
ఆనందోత్సాహాలతో తేలియాడేరుప్రజలు
భాద్రపద శుక్ల చవితి శుభదినం
అది బొజ్జ వినాయకుడి జన్మ దినం
దేశ విదేశ ప్రజలందరికీ గొప్ప పర్వదినం
పూజలుమంత్రాలతో జగతిదద్ధరిల్లుజనం!
శుక్ల పక్షం విదియ రోజు సువర్ణ గౌరీపూజలు
శుక్ల పక్ష తదియ రోజు అట్ల తద్దెపూజలు
శుక్ల పక్ష చవితి గణేశుడి పూజలు
శుక్ష పక్ష పంచమి ఋషిపంచమి పూజలు
శుక్ల పక్ష అష్టమి రోజు రాధాకృష్ణ పూజలు!
ప్రతి పట్టణములో , ప్రతి గ్రామంలో
వీది వీదినా , గణేశుడి ప్రతిమనిలబెట్టి
నవరాత్రులు , వేద మంత్రాలతో
పూజలు చేయుచు , భజనలు చేయుచు
కొలిచెదరు విఘ్నేశ్వరుడిని భక్తితోడ
విఘ్నాలు తొలగించమని వేడుకునెదరు!
ధుష్ట శిక్షణ , శిష్ట రక్షణకు, విష్ణువు
మూడవ అవతారమైన వరహావతారం
ఐదవ అవతారమైన వామనావతారం
ఎత్తినది భాద్ర పదమాసము లోనే!
భాద్ర పద కృష్ణపక్షం, పెద్దలకు ప్రీతికరం
పిండ తిలకాలు వదిలి మొక్కుతీర్చెదరు
పెద్దలమావాస్యకృష్ణపక్షం,అశుభ దినములు
మంచి పనులను చేయుట మానుకునెదరు
అలా యెన్నియో విశిష్టతలు గలమాసం
భాద్రపద మాసమనుట సందేహము లేదు!
భాద్రపద మాసం విశిష్టత
మాసములలో ఆరవది
వర్ష ఋతువులో రెండవది
చంద్రదర్శన భద్రతలకు,మరెన్నో విశిష్టతలకు
మారుపేరు ఈ భాద్రపద మాసము!
పౌర్ణమి తిధిన ,చంద్రుడు ఉత్తర భాద్రపద నక్షత్రం
పూర్వ భాద్ర పద నక్షత్రం చేరువలలో నున్నపుడే
వచ్చు మాసమే భాద్ర పద మాసము
అని చెప్పుచుండెను జోతిష్య శాస్త్రము!
భాద్రపదమాసమునకుండే నెన్నియోవిశిష్టతలు
శుక్ష పక్ష పాడ్యమి నుండి చతుర్ధశి వరకు
పండుగలు ఉత్సవాలతో పరవశించేరు
ఆనందోత్సాహాలతో తేలియాడేరుప్రజలు
భాద్రపద శుక్ల చవితి శుభదినం
అది బొజ్జ వినాయకుడి జన్మ దినం
దేశ విదేశ ప్రజలందరికీ గొప్ప పర్వదినం
పూజలుమంత్రాలతో జగతిదద్ధరిల్లుజనం!
శుక్ల పక్షం విదియ రోజు సువర్ణ గౌరీపూజలు
శుక్ల పక్ష తదియ రోజు అట్ల తద్దెపూజలు
శుక్ల పక్ష చవితి గణేశుడి పూజలు
శుక్ష పక్ష పంచమి ఋషిపంచమి పూజలు
శుక్ల పక్ష అష్టమి రోజు రాధాకృష్ణ పూజలు!
ప్రతి పట్టణములో , ప్రతి గ్రామంలో
వీది వీదినా , గణేశుడి ప్రతిమనిలబెట్టి
నవరాత్రులు , వేద మంత్రాలతో
పూజలు చేయుచు , భజనలు చేయుచు
కొలిచెదరు విఘ్నేశ్వరుడిని భక్తితోడ
విఘ్నాలు తొలగించమని వేడుకునెదరు!
ధుష్ట శిక్షణ , శిష్ట రక్షణకు, విష్ణువు
మూడవ అవతారమైన వరహావతారం
ఐదవ అవతారమైన వామనావతారం
ఎత్తినది భాద్ర పదమాసము లోనే!
భాద్ర పద కృష్ణపక్షం, పెద్దలకు ప్రీతికరం
పిండ తిలకాలు వదిలి మొక్కుతీర్చెదరు
పెద్దలమావాస్యకృష్ణపక్షం,అశుభ దినములు
మంచి పనులను చేయుట మానుకునెదరు
అలా యెన్నియో విశిష్టతలు గలమాసం
భాద్రపద మాసమనుట సందేహము లేదు!
- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
హైదరాబాద్