మనిషి మనసు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

మనిషి మనసు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

మనిషి మనసు

మనిషికి మనసుకి
ఒక సన్నని గీత
అదే దేవుని రాత
మనిషి వద్దని
మనసు కావాలని
ఆరాటపడుతూ
ఆవేశపడుతూ
లేనిదానికోసం
కానిదానికోసం
కావాలనే తపన
పొందాలనే ఆశ
మనసు ఆరాటం
మనిషి పోరాటం
అదే జీవనపోరాటం
అదే జీవన చదరంగం
ఒక్కొక్క చదరం లో
ఒక్కొక్క ఎత్తుగడ
ఒక్కొక్క ఎత్తుగడకి
ఒక్కొక్క ఆలోచన
ఆ ఒక్క ఆలోచనే
మనిషిని మార్చేస్తుంది
మనసుని యామారుస్తుంది
యామారిన మనసు
మనిషిని 
గతి తప్పిస్తుంది
గతి తప్పిన మనిషి
మతి తప్పుతుంది
మతి తప్పిన మనిషి మనసు
అధోగతి దుర్గతి
అవుతుంది
అందుకే 
ఆ మనిషికి మనసుకి
ఉన్న సన్నని గీతను
అతి సున్నితంగా
అర్ధం చేసుకుంటూ
ముందడుగు వేస్తే
మనిషి మనసు రెండూ
సద్గతి పొందుతాయి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా



0/Post a Comment/Comments