ప్రక్రియ:సున్నితం, రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత --చంద్రకళ. దీకొండ

ప్రక్రియ:సున్నితం, రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత --చంద్రకళ. దీకొండ


 ప్రక్రియ:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు

1)
అజ్ఞాన తిమిరం తొలగించేవాడు
విజ్ఞాన దీపాలు వెలిగించేవాడు
నిరంతర విద్యార్థి అతడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
2)
తరతమ్యాలెరుగక విద్యను బోధించువాడు
చెడునుంచి మంచికి మళ్లించువాడు
విద్యార్థిని తీర్చిదిద్దే శిల్పి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
3)
కనుబొమ్మల కదలికలతో శాసించువాడు
విద్యార్థి తప్పులను సరిదిద్దువాడు
మానవత్వ విలువలను పెంపొందించువాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
4)
అందనంత ఎత్తుకు నీవెదిగినా
అఆలు నేర్పిన పంతులే
భావి జీవితానికి పునాది
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
5)
అజ్ఞానహతులకు చికిత్సనందించే 
సంజీవనీతీవ
విరజానదిని దాటించే పూలనావ
నీడనిచ్చే తరువు గురువు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!
*************************************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
చరవాణి:9381361384

0/Post a Comment/Comments