వలసబతుకులు --పసుమర్తి నాగేశ్వరరావు

వలసబతుకులు --పసుమర్తి నాగేశ్వరరావు

వలసబతుకులు

దైవమా నీకు ఇది న్యాయమా
వలసబతుకుల జీవనమా
పేద బ్రతుకుల పయణమా
ఇది మాకు శాపమా పాపమా

బరువు భాద్యతలు తలపైన
చిరునవ్వులు పెదవుల పైన
ఆత్మవిశ్వాసం గుండెలోన
అనుక్షణం క్షణమొక యుగమైన జీవితం

చకచక అడుగులు వేస్తూ
టకటక పనులు చేస్తూ
కర్తవ్యం నెరవేరుస్తూ
కార్యదీక్ష తో ముందడుగు వేస్తూ

బాధలను మైమరుస్తూ
భాద్యతలు తీరుస్తూ
బంధాలను గుర్తిస్తూ
పుట్టినందుకు బతకాల్సిందేనని నిట్టూరుస్తూ

కాలానికి సలామ్ కొడుతూ
దైవానికి దండం పెడుతూ
భవిత బాగుండాలని కోరుతూ
అడుగులో అడుగు వేస్తున్నాం

మేమూ మనుసులమే
మాకూ మనసులుంటాయి
మాకూ కొరికలుంటాయి
పడుతున్నాం కదా అని కింద పడేయకు

భగవంతుడా 
మా ఈ వలసబతుకుల లో 
మార్పు రావాలి
అదే మా కోరిక 
నీవిచ్చే వరం 
మా ఫలం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments