ఆయువు తీయకు. .... దొడ్డపనేని శ్రీ విద్య

ఆయువు తీయకు. .... దొడ్డపనేని శ్రీ విద్య


అంతరంగం ప్రశ్నిస్తే

శీర్షిక: ఆయువు తీయకు


*అంతరంగం ప్రశ్నిస్తే*
ఆయువు తీసుకుంటావా
గొంతెత్తి సమస్య విన్నవిస్తావా
జీవిత మార్పును స్వాగతిస్తావా
మనకెందుకులే అనుకుంటావా

*అంతరంగం ప్రశ్నిస్తే*
వివేకంతో ఆలోచన సాగాలి
వ్యవహార శైలిలో మార్పు రావాలి
విచక్షణ తో నిర్ణయించాలి
స్వభావం లో లక్ష్య సాధన ఉండాలి

*అంత రంగం ప్రశ్నిస్తే*
అవరోధాలను తొలగించు
సమస్యల విశ్లేషణ కు ప్రయత్నించు
సత్యాసత్యాల అన్వేషించు
యదార్థ మెరిగి జీవించు

అంతరంగం ప్రశ్నిస్తే
వికసించి ఎదుగటమే జీవితం
అణిచివేసే పరిస్థితులను అంచనా వేయి
బలహీనపడే స్థితి నుంచి బయటకు రా
ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం చేయి


*అంతరంగం ప్రశ్నిస్తే*
అనుభవాల అనుభూతిని స్వాగతించు విజయావకాశాలను అందుకొను
మార్పుల మలుపులను అంచనా వేయి
ఆహం వీడి నిజం ఎరిగి బ్రతుకు బాటను సుసంపన్నం  చేయి
✒️📖✒️📖✒️📖✒️
 


*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ

0/Post a Comment/Comments