నీవు లేవుగా తల్లి...(స్మరణ కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .

నీవు లేవుగా తల్లి...(స్మరణ కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .

నీవు లేవు గా తల్లీ
-------------------------
అమ్మ మా  ప్రేమ పూల కొమ్మా
నీవే లోకాన వున్న ఓ గదమ్మా
నేడు నీ తల్లిని చేరుకోవమ్మా
మా మురిపాల మా ముద్దుగుమ్మా!

ఆ దేవునికేంచేసాం మేం పొరపాటు
మాకెందుకు కల్గించె నీ యడబాటు
ఓ తల్లినీవైనా అడగవే ఆదైవాన్ని
సంభవించి అనుభవించు వైనాన్ని!

అమ్మా మా ప్రేమ పూలకొమ్మా
ఇలలో నీవు మాకు కానరాకున్నా
నీ జ్ఞాపకాలతో ఊసులాడుతున్నా
రాత్రి పగలనక నిన్నే నే తెలుస్తున్నా

నువ్వు కన్న కలలన్నీంటికి
నేనైనానులే ఇక సాకారం
 నీఆశలు ఆశయాలకు
నే కట్టేస్తాఓ గట్టి ప్రాకారం!

సృష్టికి ప్రతి సృష్టియై నిలిచావమ్మా
అమ్మ తనకై నిత్య తప్పించావమ్మా
నీ బాధను భరించి మామంచినియెంచి
ఎత్తి నావు పునర్జన్మ ఇక నీవమ్మా!

ఎన్నెన్నో ఏళ్ళు గడిచిపోతున్నా
ఈమాయదారి కాలం ఆగనన్నది
నీ ఎడబాటు మాత్రం మాకు ఇల
నిన్న మొన్న లాగే అనిపిస్తున్నది!

బిడ్డల భవిత చూసి ప్రతి తల్లి
మురిసిపోవు తన్మయత్వంతో మళ్లి
మరి మా జీవితాన్ని చూసి తుళ్ళి
తుళ్ళి పడేందుకు లేవుగామాతల్లి!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments