రాకాసి రాజంలో రాలిపోతున్న అబలలు
(సున్నితాలు)
----------------------------------------
కామాంధుల చేతుల్లో అబలలు
అవుతున్నారు సదా బలిపశువులు
ఇకనైనా కావాలోయ్ సబలలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
చైతన్యం రావాలి స్త్రీలలో
పెనుమార్పు తేవాలి హృదయాల్లో
వెలుగులు నింపాలి జీవితాల్లో
చూడచక్కని తెలుగు సున్నితంబు!
మానవ మృగాల ఆటకట్టాలి
మగువలకు బ్రహ్మరథం పట్టాలి
మంచికిల శ్రీకారం చుట్టాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
బాపు కలలు సాకారమవ్వాలి
అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగాలి
మహిళలకు సంరక్షణ దొరకాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
బలమైన చట్టాలు రావాలోయ్
అతివలు అణుబాంబులు కావాలోయ్
భయపెట్టే రోజులు పోవాలోయ్
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.