ప్రతి హృదయాన్ని కదిలించిన పాట ... -డా. చిటికెన కిరణ్ కుమార్

ప్రతి హృదయాన్ని కదిలించిన పాట ... -డా. చిటికెన కిరణ్ కుమార్

ప్రతి హృదయాన్ని కదిలించిన పాట 
=======================

         ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోట విన్నా... బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా... అనే పాట  వింటున్నాం. పెళ్లి బంధం తర్వాత పుట్టింటి నుండి మెట్టినింటికి నవ వధువు  బయలుదేరుతున్నప్పుడు సాధారణంగా బాద హృదయంతో  పెళ్లి కుటుంబ సభ్యులతో పాటు

వదువు కూడా ఉంటుంది. ఇటీవలే మంచిర్యాలకు చెందిన నూతన జంట  ఈ పాటకు అనుగుణంగా  నృత్యం చేస్తూ వివిధ సామాజిక మాధ్యమాలలో మనం చూసే ఉన్నాం.


 బుల్లెట్ బండి పాటకు ఎందుకు ఇంత ఆదరణ?

=================================


ఏ పట్టు చిరనే కట్టుకున్న

కట్టుకునోల్లో కట్టుకున్నా

టిక్కి బొట్టే పెట్టుకున్న

పెట్టుకునోల్లో పెట్టుకున్న

నడుముకు వడ్డలం చుట్టుకున్న

చుట్టుకునోల్లో చుట్టుకున్న

దిష్టి చుక్కనే దిద్దుకున్న

దిద్దుకునోల్లో దిడ్డుకున్న

పెళ్ళికూతురు ముస్తాబురో. . .

నువ్వు ఎడకనస్తావురో. . .

చెయ్యి నీ చేతికి యీస్తనురో

అడుగు నీ అడుగులో ఎస్తనురో

నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ

ఇట్టే వస్తా రా నివెంట

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని

  || ఏ పట్టు చిరనే ||


===========      సాధారణంగా  పెళ్లి అనే అనుబంధంతో  ప్రతి నూతన వధువు ఒక కొత్త ఇంటికి పయనం అవడం ఎన్నో ఆశలతో తన జీవితంలో ఊహించుకోవడం జరుగుతుంది. ప్రతి వధువుకి, ప్రతి అమ్మాయి కుటుంబ సభ్యులకి ఈ పాట లో ఉన్నటువంటి సన్నివేశాలు ( పదాల రూపంలో ) కళ్ళముందు కదలాడాయి. పెళ్లి అనే అనుబంధం  మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఏకమై కోటి ఆశలతో నవ వధువు మెట్టినింటికి పయన మవుతుంది.  ఈ సందర్భంలో వీడియో గ్రాఫర్లు,ఫోటోగ్రాఫర్లు పెళ్లి వీడియో మిక్సింగ్, ఎడిటింగ్  లో  బాధాతప్త హృదయంతో  చలన చిత్రాలలో చిత్రీకరించినటువంటి పాటలతో ఎడిటింగ్ చేస్తారు. కానీ  ఫోటో వీడియో గ్రాఫర్ లను సైతం కూడా ఈ పాట ఆశ్చర్యచకితుల్ని చేసింది అనడానికి  సందేహం లేదు. సాధారణంగా  చలనచిత్రాలలో ఈ సన్నివేశం పై ఎన్నో పాటలు, మరెన్నో  పెళ్లి కూతురు మనసు తెలియజేయడం కోసం గతంలో అద్భుతంగా చూపించారు. కానీ  "బుల్లెట్ బండి పాట" ఒక నూతన ఒరవడితో తెలంగాణ జానపదం తో ఇంత జనాదరణ పొందింది అంటే ఆ పాటలో ఉన్న  వాస్తవాన్ని  తెలుసుకుందాం.


     బుల్లెట్ బండి పాట  రచయిత  లక్ష్మణ్  ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని  ఎంపిక చేసుకున్నారు. అందులో ప్రతి పదాన్ని  గుండెకు హత్తుకుని, ప్రతి ఒక్కరికి తెలిసే  ప్రజల హృదయాలను కదిలించే విధంగా పద కూర్పు సమకూర్చారు. నవ వధువు కు ఎన్నో ఆశలతో పాటు కొత్త లోకంలో   వరుడుని చూసుకుంటా అని తెలియజేసే రచయిత అనుకున్న భావాన్ని ఎలాంటి కల్పితమైన టువంటి పదాలు వాడకుండా తెలంగాణ యాసలో..... వచ్చేత్తపా,...

నువ్వు నన్నేలు తున్నవురో ......అంటూ  తెలియజేశాడు.


 *జానపదాల్లో బుల్లెట్ బండి పాట తో నూతనత్వం* 


 ఈ పాటలో చెప్పినట్లుగా సమాజంలో ప్రతి జంట  మన సాంప్రదాయలకు అనుగుణంగా తన జీవితాన్ని  మలచుకొని,మసలు కొని  ఆశల జీవితంలో ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.


======================


 *-డా. చిటికెన కిరణ్ కుమార్* 

    కథా /వ్యాస రచయిత,

సభ్యులు,ఇంటర్నేషనల్ బెనవలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్.

    రాజన్న సిరిసిల్ల.

    సెల్.9490841284

0/Post a Comment/Comments