స్నేహ - మధురిమలు🥀🌸 ~~~వి.యన్.చారి

స్నేహ - మధురిమలు🥀🌸 ~~~వి.యన్.చారి

🌸🥀స్నేహ - మధురిమలు🥀🌸
   ~~~వి.యన్.చారి

స్నేహమంటె కరగని కల
స్నేహమంటె విరగని అల
కష్టాలకు జడవ కుండ
నిను కప్పిఉంచు గొడుగుల!!           

ఆదుకొనే హస్తము
కష్టంలో దైవము
నింగిలోన నీకు ఎవరు
సాటి రారు నేస్తము!!

మతమన్నది యేదైనా
కులమన్నది వేరైనా
విడువడనిది చెలిమంటే
రాజైనా, పేదైనా!!

ఎల్లలంటే ఎరుగనిదీ
కల్ల కపట మెరుగనిదీ
కలకాలం  నీడలా 
వీడకుండ యుండునిదీ!!

నమ్మకాన్ని యిచ్చుచెలిమి
అమ్మ ప్రేమ పంచుచెలిమి
అనుక్షణం తోడుగా
నాన్నలా కాపాడుచెలిమి!!

మధురమైన బంధము
అజరామర సౌధము
సృష్టిలోన వెలకట్టని
స్నేహమెంతొ మధురము!!

........✍️మణికర్ణిక🌹☘️
వి.నర్సింహా చారి,
భాషోపాధ్యాయులు,
ZPHS.శేరిలింగంపల్లి. 

0/Post a Comment/Comments